ఫేస్‌బుక్, ట్విటర్లకు గుడ్‌బై చెబుతున్న యువత! - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్, ట్విటర్లకు గుడ్‌బై చెబుతున్న యువత!

March 10, 2018

కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్లు.. సోషల్ మీడియాపై వేలం వెర్రిలా ఎగబడిన జనానికి ఇప్పుడు దానిపై మొహం మొత్తుతోంది. ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లయిన ఫేస్‌బుక్‌, ట్విటర్‌లకు ఆదరణ గణనీయంగా తగ్గిపోతోంది. యువతలో అత్యధికం వీటికి దూరంగా జరిగిపోతామంటున్నారు. ఇప్పటికే కోట్లాదిమంది నమస్కారం పెట్టేసి వెళ్లిపోయారు.

పని ఒత్తిడికి తోడు సోషల్ మీడియాలో మానసిక ఒత్తిడికి గురిచేసే అనవసర సమాచారం, కెరీర్‌పై శ్రద్ధ, కొత్త నైపుణ్యాల సాధన, డబ్బు పొదుపు, మానసిక ప్రశాంతత తదితరాల కోసం జనం వీటి నుంచి పారిపోతున్నారు. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న మార్కెట్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ సంస్థ ఓరిజిన్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ సంగతులు వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా 18 నుంచి 24 ఏళ్ల లోపు వయసున్న వెయ్యి మందిని ప్రశ్నించిన విశ్లేషించారు. సర్వేలో భారత్‌ నుంచి 40 మంది పాల్గొన్నారు.

కారణాలు ఏవైనా యుతవ మాత్రం ఫేస్‌బుక్, ట్విటర్లకు దూరంగా ఉండేందుకు యత్నిస్తున్నారు.50 శాతం మంది మానసిక ప్రశాంతత కోసం యత్నిస్తున్నారు. 34 శాతం మంది డివైస్‌లలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్  వంటి యాప్‌లను తీసేశారు. అవసరమైతే ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. తాము వీటితో విలువైన సమాయాన్ని వృథా చేసుకుంటున్నామని 41 శాతం మంది వాపోయారు. చాటింగ్‌ కంటే ఆన్‌లైన్‌ షాపింగ్‌కే ఎక్కువ సమయం కేటాయించామని తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలను పంచుకోవడంపై తమకు ఆసక్తి లేదన్నారు.