యాడ్స్‌పై యూజర్ల రచ్చ.. నిర్ణయం మార్చుకున్న వాట్సాప్  - MicTv.in - Telugu News
mictv telugu

యాడ్స్‌పై యూజర్ల రచ్చ.. నిర్ణయం మార్చుకున్న వాట్సాప్ 

January 22, 2020

chb nmb

‘అబ్బా ఈ యాడ్స్ గోలేంటిరా నాయనా? టీవీల నుంచి సోషల్ మీడియాకు పాకిన ఈ గోల వాట్సాప్‌కు కూడానా. అసలు బ్రేకులు లేకుండా ఏ వీడియోనూ ప్రశాంతంగా చూసుకోనివ్వరా’ అని చాలామంది సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. తమ సొంత యాప్ వాట్సాప్‌లో యాడ్ ఫీచర్ తీసుకురాబోతున్నట్టు గత ఏడాదిలోనే ఫేస్‌బుక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఫేస్‌బుక్ నిర్ణయంపై చాలా మంది ఇలా అసహనం వ్యక్తంచేశారు. దీంతో వాట్సాప్ వెనక్కు తగ్గక తప్పలేదు. యూజర్లు ఇచ్చిన షాక్‌తో కంపెనీ తమ నిర్ణయాన్ని మార్చుకుంది. వాట్సాప్ స్టేటస్‌లో ఇంటిగ్రేటెడ్ యాడ్స్ డిస్‌ప్లే చేయడంపై వాట్సాప్ టీమ్ వర్క్ చేస్తున్నట్టు ఇటీవలే వాల్ స్ట్రీట్ జనరల్ రిపోర్టు తెలిపింది. అయితే, వాట్సాప్ కోడ్ నుంచి ఆ ఫీచర్ డిలీట్ చేసినట్టు సదరు వాట్సాప్ టీమ్ నివేదిక పేర్కొంది. 

వాట్సాప్ వ్యవస్థాపకులు అక్టాన్, కుయూమ్.. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్‌తో విభేదాలు తలెత్తడంతో 2017లో వారిద్దరూ రాజీనామా చేసి వెళ్లిపోయారు. అప్పుడు కూడా వాట్సాప్‌లో చాట్స్ మధ్య ఇన్ఫూజ్ యాడ్స్ డిస్‌ప్లే చేయాలనే జుకర్ బర్గ్ నిర్ణయానికి వారిద్దరూ అభ్యంతరం వ్యక్తంచేశారు. మై యూజర్స్ ప్రైవసీతో సహా తన కంపెనీని అమ్మేశానని.. రాజీ పడాలా లేదా అనేది ఒకటి ఎంచుకున్నాను.. అంటూ మరుసటి రోజున అక్టాన్ ఫోర్బ్స్‌తో మాట్లాడారు. 

కాగా, 2009లో ప్రవేశపెట్టిన వాట్సాప్, 2014లో ఫేస్‌బుక్ సొంతమైంది. వాట్సాప్ నుంచి ఎఫ్‌బీ 22 బిలియన్ల డాలర్లు సంపాదించింది. ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్‌గా వాట్సాప్ రికార్డు సృష్టించింది. ఈ యాప్ ప్రారంభంలో డౌన్‌లోడ్ ఫీజు.. సబ్‌స్క్రిప్షన్ ఫీజు 0.99 డాలర్లుగా ఉండేది. ఆ తర్వాత ఫేస్‌బుక్ తమ యూజర్ల సౌకర్యార్థం 2019 నుంచి ఉచితంగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. అదే ఏడాదిలోనే వాట్సాప్‌లో కూడా ఇన్‌స్టాగ్రామ్ తరహాలో యాడ్స్ ప్రవేశపెట్టాలని అనుకుంది. యూజర్లు వ్యతిరేకించడంతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోక తప్పలేదు.