టిక్ టాక్ ను భారత్ లో నిషేధించడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేలా ఇన్‌స్టా ‘రీల్స్’, యూట్యూబ్ ‘షార్ట్స్’, ‘జోష్’ యాప్‌లు.. యూజర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కూడా టిక్ టాక్‌కు చెక్ పెట్టేలా కొత్త కొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తుంది. ఇప్పటికే టిక్ టాక్ తరహాలో షార్ట్ వీడియోలు వీక్షించడంతో పాటు ఇన్స్టాగ్రాం పోస్ట్‌లు సైతం ఫేస్బుక్లో కన్వర్ట్ అయ్యేలా డిజైన్ చేసింది. అయితే తాజాగా ఫేస్బుక్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
ఫేస్బుక్ ఒక ప్రకటనలో.. ‘యూజర్ల డీఫాల్ట్ స్క్రీన్ హోమ్ పేజ్‌లో అవుట్ సైడ్ క్రియేటర్స్ నుంచి మోస్ట్ ఎంటర్ట్రైనింగ్ పోస్ట్‌లు కనిపిస్తాయి. షార్ట్ వీడియో సర్వీస్ రీల్స్, స్టోరీస్‌కి ఈజీ యాక్సెస్ ఉంటుంది.’ అని పేర్కొంది. న్యూ ఫీడ్స్ ట్యాబ్ కింద ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫేవరెట్ పేజెస్ నుంచి రీసెంట్ పోస్ట్‌లు చూడవచ్చని ఫేస్బుక్ తెలిపింది. ఎక్కువగా పోస్ట్‌లు చూడాలనుకునే ఫ్రెండ్స్, ఫేవరెట్ పేజ్‌లతో ‘ఫేవరెట్స్ లిస్ట్’ క్రియేట్ చేసే సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
కొత్త అప్డేట్ల గురించి ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ ఓ పోస్ట్‌లో తెలిపారు. యూజర్లు కోరిన విధంగా మోస్ట్ రిక్వెస్టెడ్ ఫీచర్ ‘ఫీడ్’ ఫీచర్‌ను డెవలప్ చేశాం. ఈ ఫీచర్ సాయంతో ఫ్రెండ్స్, గ్రూప్స్, పేజెస్‌లో అప్డేట్ అయ్యే లేటెస్ట్ పోస్ట్‌లను వీక్షించవచ్చు. స్నేహితులు ఏం పోస్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు అది నెరవేరబోతుందని అన్నారు.