కర్నూలులో ఫ్యాక్షన్ ఫైట్.. టీడీపీ అభ్యర్థిపై కాల్పులు - MicTv.in - Telugu News
mictv telugu

కర్నూలులో ఫ్యాక్షన్ ఫైట్.. టీడీపీ అభ్యర్థిపై కాల్పులు

March 16, 2019

కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థిపై ప్రత్యర్థుల దాడి కలకలం రేపుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న తిక్కారెడ్డిపై ప్రత్యర్థులు వేటకొడవలితో దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రాలయం మండలం ఖగ్గల్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించేందుకు వెళ్లిన తిక్కారెడ్డిని వైసీపీ నాయకులు అడ్డుకుని దాడికి యత్నించారు. ఈ క్రమంలో తిక్కారెడ్డి గన్‌మెన్‌ గాల్లోకి కాల్పులు జరపడంతో ప్రమాదవశాత్తూ తిక్కడారెడ్డితో పాటు ఏఎస్‌ఐ గాయపడ్డారు.

Faction Fight In Kurnool.. Attacking On Tdp Candidate Tikka reddy, kurnool, Mantralayam Constituency

ఎన్నికల ప్రచారంలో భాగంగా తిక్కారెడ్డి శనివారం కగ్గల్‌ గ్రామానికి వెళ్లారు. మొదటి నుంచి ఖగ్గల్‌లో వైసీపీకి మంచి పట్టుంది. దీంతో అక్కడ ఎలాగైన టీడీపీ జెండా ఆవిష్కరించేందుకు తిక్కారెడ్డి రోడ్డు‌తో పలువురు కార్తకర్లు అక్కడి చేరుకున్నారు. వేసీపీ నాయకులు వారిని అడ్డుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దాంతో తిక్కారెడ్డి గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు తిక్కారెడ్డి ఎడమకాలికి బుల్లెట్‌ గాయమైంది. మాధవరం ఏఎస్‌ఐ వేణుగోపాల్‌ కుడి కాలుకు కూడా గాయామైంది. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో గ్రామంలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఓటమి భయంతోనే వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి తనపై హత్యాయత్నం చేశారని తిక్కారెడ్డి ఆరోపిస్తున్నాడు.