వైకుంఠపురం ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా..? - MicTv.in - Telugu News
mictv telugu

వైకుంఠపురం ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా..?

January 17, 2020

ghdfbb

అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం’ సినిమా విడుదలై సక్సెస్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వైకుంఠపురం ఇల్లు అందరిని ఆకట్టుకుంది. ఇంత అందమైన ఇల్లు ఎవరిది.? ఎక్కడ ఉంది అని అంతా చర్చించుకున్నారు. కొంత మంది దాన్ని సెట్ వేశారని అనగా మరి కొంత మంది మాత్రం నిజమైన ఇల్లు అంటూ పేర్కొన్నారు. తాజాగా దీనిపై ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అల.. వైకుంఠపురములో ఉన్న భవనం నిజమైనదేనని తేలింది. 

ghdfbb

ఇది ఓ మీడియా సంస్థ యజమాని కూతురు అత్తారిల్లుగా చెబుతున్నారు. హైదరాబాద్‌‌లోని జూబ్లిహిల్స్‌లో ఉన్న ఈ ఇంటిలోనే సినిమాను కోసం 20 రోజుల పాటు షూటింగ్ చేశారట. ఓసారి త్రివిక్రం వారి ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఇంటిని చూసి తన సినిమాకు తగిన భవనంగా భావించి షూటింగ్‌కు అనుమతి కోరడంతో వారు కూడా అంగీకరించారని తెలుస్తోంది. గతంలో ‘అత్తారింటికి దారేది’ సినిమా కోసం రామోజీఫిల్మ్‌ సిటీలో పెద్ద సెట్ వేసిన త్రివిక్రమ్‌ ఈసారి మాత్రం నిజమైన ఇంటిలోనే షూటింగ్ చేశారు. ఈ చిత్రంలో ఇదే ఎంతో అట్రాక్షన్‌గా నిలిచింది. దీన్ని చూసి ముచ్చటపడిన అల్లు అర్జున్ కూడా అలాంటి  విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నారట. అందుకే ఇటీవల ఆయన సొంత ఇంటికి భూమి పూజ కూడా చేశారు.