బూడిదలో నిప్పు పీఓకే.. భారత్‌కు అనుకూలిస్తుందా?  - MicTv.in - Telugu News
mictv telugu

బూడిదలో నిప్పు పీఓకే.. భారత్‌కు అనుకూలిస్తుందా? 

August 7, 2019

Facts about pakistan occupied kahsmir

ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తర్వాత తమ టార్గెట్ పీఓకే స్వాధీనమేనని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. కశ్మీర్ వ్యహారాన్ని ఒక కొలిక్కి తెచ్చిన మోదీ ప్రభుత్వం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను ఎలా చేతికి తెచ్చుకుంటుందనే ఆసక్తి నెలకొంది. పీఓకే గత, ప్రస్తుత పరిస్థితులపై మీడియాలో చర్చ జరగుతోంది. 

పాక్ దురాక్రమణ..

Image result for pok in 1947

1947లో స్వతంత్ర కశ్మీర్ రాజ్యానికి చెందిన కొంత ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది. దాన్నే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంటారు. పాక్ దీన్ని రెండు భాగాలుగా విభజించింది. వాటిలో ఒకటి ఆజాద్ కశ్మీర్, రెండోది గిల్గిత్ బాల్తిస్తాన్. పీఓకేను పాలించేందుకు ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీతోపాటు ప్రధాన మంత్రి, అధ్యక్షుడు, పాలక మండలి సభ్యులు ఉంటారు. పీఓకేకు దక్షిణం వైపున భారత్, ఎగువవైపు ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులు. తూర్పు, ఉత్తరం వైపు వాఖన్ పర్వతాలు,  చైనా సరిహద్దు రాష్ట్రమైన గ్జిన్ జియాంగ్ ఉన్నాయి. పీఓకేలోని  హున్జా గిల్గిత్, షాక్స్‌గామ్ లోయ, రాక్సామ్ ప్రాంతాలను పాకిస్తాన్ 1963లో చైనాకు ధారదత్తం చేసింది. ఆ ప్రాంతాన్ని ట్రాన్స్ కారకోరం అని పిలుస్తారు.

స్వరూపం.. 

Related image

13,300 కిలో మీటర్ల పరిధిలో 45 లక్షల జనాభా ఉన్న పీఓకే రాజధాని ముజఫరాబాద్. పస్తూ, ఉర్దూ, కశ్మీరీ, పంజాబీ  ప్రధాన భాషలు. కొంతమంది మరాఠీ కూడా మాట్లాడతారు. ప్రత్యేక దేశంగా భావించే ఈ ప్రాంతానికి సుప్రీం కోర్టు, హైకోర్టు కూడా ఉన్నాయి. మిర్పూర్భింభర్, కోట్లీ, ముజఫరాబాద్, భాగ్, నీలం, రావల్కోట్, సుధోంత్ జిల్లాలు కాగా, 19 తాలూకాలు, 182 కౌన్సిళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పాఠశాలలు, కాలేజీలు చాలా తక్కువగా ఉన్నా అక్షరాస్యత మాత్రం 72 శాతం. మొక్కజొన్న, గోధుమలు. వీటితో పాటు అటవీ ఉత్పత్తులు, పశువులు, మేకలు, గొర్రెల పెంపకం ప్రజల జీవనాధారం. వీటితో పాటు పుట్టగొడుగులు, తేనె, ఆక్రోట్, యాపిల్స్, చెర్పీ పళ్లు, ఆయుర్వేద మూలికలు, మొక్కల పెంపకం ఇతర ఆదాయ వనరులు. బొగ్గు, సున్నం, బాక్సైట్ గనులు ఉండటంతో ఉద్యోగ అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అలాగే చెక్కతో తయారు చేసే వస్తువులు, చిన్నపాటి వస్త్ర పరిశ్రమలు, నగిషీలు చెక్కిన కార్పెట్లు, దుప్పట్లు ఇక్కడ నుంచి మనదేశంతో పాటు అరబ్, రష్యాలకు ఎగుమతి అవుతుంటాయి. 

ఎన్నాళ్లీ పెత్తనం?

Image result for pok in 1947

ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నా, పాకిస్తాన్ పెత్తనంతో ఇక్కడ జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక దేశం కోసం వీరు పోరాటం చేస్తున్నారు. కొన్నేళ్లుగా బహిరంగ ప్రదర్శనలతో నిరసన తెలుపుతున్నారు. తమపై పాక్ ఆర్మీ పెత్తనం ఎక్కువైందని, అంతర్జాతీయ సమాజం కలుగజేసుకుని విముక్తి ప్రసాదించాలని కోరతున్నారు. అమెరికా, యూరప్ తదితర ప్రాంతాల్లో స్థిరపడిన పీఓకే వాసులు  పాక్ నుంచి తమ ప్రాంతానికి విముక్తి కల్పించాలని అగ్రదేశాలతో లాబీయింగ్ చేస్తున్నాయి. పీఓకేలోనూ ఉధృతంగా ఆందోళనలు సాగుతుంటాయి. పాక్ సైన్యం వాటిని ఉక్కుపాదంతో అణచేస్తూ ఉంటుంది. పర్యాటకం, ప్రకృతి వనరుల పరంగా విలువైన ఈ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయాన్ని పాక్ తన ఖజానాకు తరించడంపై పీఓకే వాసలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమ సహజవనరులు పాక్ ప్రాజెక్టుల పేరుతో ధ్వంసం చేస్తోందని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ పీఓకేను ఎలా రాబట్టుకోవాలని తమకు తెలుసని హెచ్చిస్తోంది. అయితే 7 దశాబ్దాల తర్వాత పీఓకే ప్రజలు భారత్‌ పాలనలోకి రావడానికి ఇష్టపడతారా లేదా అన్నది కాలం తేల్చాల్సిన అంశం.