ఫైలట్ల సమయస్పూర్తితో తప్పిన ప్రమాదం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. సీఎం ఫడ్నవిస్ హెలికాప్టర్‌ను అధికారులు అత్యవసర పరిస్థితిలో రోడ్డుపై దింపేశారు. అధికారులు అప్రమత్తమై సురక్షితంగా హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. సీఎం ఫడ్నవిస్, ఇతర అధికారులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ఫడ్నవిస్ మాట్లాడుతూ మా హెలికాప్టర్ లాతూర్ సమీపంలో ప్రమాదానికి గురైందన్నారు. ఫైలట్ అప్రమత్తమవడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డామని చెప్పారు..
హెలికాప్టర్ కూలిన ఘటన వల్ల మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కుడి చేతికి స్వల్ప గాయమైనట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే తాము క్షేమంగా ఉన్నట్లు ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. హెలికాప్టర్‌లో మొత్తం నలుగురు ఉన్నారు. దేవుని దయ, మహారాష్ట్ర ప్రజల వల్ల తాను క్షేమంగా ఉన్నట్లు సీఎం ఫడ్నవిస్ చెప్పారు. తనతో పాటు ఉన్న చేతన్ పాతక్ అనే వ్యక్తికి గాయాలైనట్లు సీఎం తెలిపారు. తన బీపీ నార్మల్‌గా ఉందన్నారు. కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ఈ ఘటన పట్ల షాక్‌కు గురైనట్లు ట్వీట్ చేశారు.
ఫడ్నవిస్‌కు సీఎం కేసీఆర్ ఫోన్
మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. సీఎం ఫడ్నవిస్ యోగక్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించివేసిన ఘటనపై ఫడ్నవిస్ సీఎం కేసీఆర్‌కు వివరించారు. హెలికాప్టర్ ప్రమాదం నుంచి ఫడ్నవిస్ సురక్షితంగా బయటపడటం పల్ల సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఫైలట్లు సమయస్పూర్తితో వ్యవహరించి ప్రమాదం జరుగకుండా చూసిన తీరును సీఎం కేసీఆర్ అభినందించారు.