పరుపుపై మలవిసర్జన చేసింది.. మాజీ భార్యతో జానీ డెప్ లొల్లి  - MicTv.in - Telugu News
mictv telugu

పరుపుపై మలవిసర్జన చేసింది.. మాజీ భార్యతో జానీ డెప్ లొల్లి 

July 11, 2020

Faeces In Bed A 'Fitting End' To Marriage, Johnny Depp Tells Court

జానీ డెప్ ఎవరో సినీ ప్రేమికులకు చెప్పాల్సిన అవసరం లేదు. ‘పైరేట్స్ ఆఫ్ కరీబియన్’ సినిమాలతో ప్రపంచమంతా అభిమానులను సంపాదించకున్న 57 ఏళ్ల ఈ హాలీవుడ్ స్టార్ ఇప్పుడు బోనులో నిలబడ్డాడు. మాజీ ప్రేయసి అంబర్ హార్డ్‌ను 14 సార్లు కొట్టి హింసించినట్లు ఆయనపై కేసు నమోదైంది. దీనిపై లండన్ కోర్టు విచారణ జరుపుతోంది. 

తాను ఏ తప్పు చేయలేదని డెప్ సమర్థించుకున్నాడు. అంబర్ హర్డ్ ప్రవర్తన విపరీతంగా ఉండేదని, తాను విసిగిపోయేవాడిని అని చెప్పాడు. ‘ఓ రోజు నేను ఇంటికి ఆలస్యంగా వచ్చాను. హర్డ్ , ఆమె ఫ్రెండ్ బెడ్ రూంలో ఉన్నారు. పొద్దున పరుపు మానవ మలం కనిపించింది. విడిపోవడానికి ఇదొక్క కారణం సరిపోతుంది.. ’ అని చెప్పాడు. ఆ సంఘటన తర్వాత తన వస్తువులను తీసుకుని వెళ్లిపోవడానికి ఇంటికి వెళ్లాడని, ఆమె గొడవ చేసిందని వివరించాడు. తాను హర్డ్‌పై ఫోన్ విరిసేయలేదని, ఆమె గడ్డాన్ని చితగ్గట్టలేదని చెప్పాడు. హర్డ్ తనను డబ్బు కోసం వేధించేందంటూ తన మేనేజర్ పంపిన మెసేజీలను చూపాడు. అంబర్ హర్డ్, డెప్ నాలుగేళ్ల ప్రేమాయణం తర్వాత 2015లో పెళ్లి చేసుకుని, రెండేళ్ల తర్వాత విడిపోయారు.