ఫెయిర్ అండ్ లవ్లీ కావాంటే మందుచీటీ చూపాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫెయిర్ అండ్ లవ్లీ కావాంటే మందుచీటీ చూపాల్సిందే..

April 23, 2018

తెల్లగా కనిపించాలనే కోరికతో యువత ముఖానికి బెలోడు ఫెయిర్ నెస్ క్రీములు రాస్తుంటారు. ఒకటి పనిచేయకపోతే  మరొకటి ప్రయోగిస్తూ ముఖాలను పాడుచేసుకుంటూ ఉంటారు. చక్కని తిండి, వ్యాయామం ఉంటే ముఖం తేటగా ఉంటుందని, రంగు అంత ముఖ్యం కాదని చెబుతున్నా వినరు. అందుకే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్‌నెస్ క్రీములు, ఆయింట్‌మెంట్లను విక్రయించాలంటే డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి అని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఆదేశించారు.దేశంలో అమ్ముతున్న 14 రకాల ఫెయిర్‌నెస్ క్రీములు, ఆయింట్‌మెంట్లలో ప్రమాదరకర స్టెరాయిడ్లు ఉన్నట్లు తేలడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. డాక్టర్ల ప్రిస్కిప్షన్ చూపితేనే వీటిని అమ్మాలని షాపుల యజమానులను ఆదేశించింది. ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మ సంబంధ ఔషదాలు, ఫెయిర్‌నెస్ క్రీములు, ఆయింట్‌మెంట్లను ఇకపై ప్రిస్కిప్షన్ చూపితేనే అమ్మాలని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘిచిన వారిపై డ్రగ్స్, కాస్మెటిక్స్ రూల్స్ 1945 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది.