సర్పదోషం అంటూ మహిళను మోసం చేసిన దొంగస్వామి - MicTv.in - Telugu News
mictv telugu

సర్పదోషం అంటూ మహిళను మోసం చేసిన దొంగస్వామి

September 13, 2019

Fake Baba Arrested in Karnataka

అమాయకులను ఆసరాగా చేసుకొని దొంగ స్వామిజీలు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. ఏదో ఒక చోట పూజలు,శాంతుల పేరుతో నగదు ఊడ్చేస్తున్నారు. ఇలాంటి వారిని నమ్మవద్దని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా కర్నాటకలో ఓ స్వామిజీ ఏకంగా తన కామవాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. దొంగ స్వామితో సహా అతని కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

భర్తతో విడిపోయి వేరుగా ఉంటున్న ఓ మహిళకు సర్పదోషం ఉందంటూ గణేష్ అనే దొంగ స్వామి నమ్మబలికాడు. ఆమె ఇబ్బందులు పోవాలంటే తాము చెప్పిన పూజలు చేయాలని సూచించాడు. తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పూజల పేరుతో ఆమెపై కన్నేశాడు. అతని కొడుకు మణికంఠ కూడా తండ్రికి పూజల్లో సాయం చేస్తూ ఇద్దరూ కలిసి తమ కామవాంఛ తీర్చుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే దోషాలను తొలగిస్తామని నమ్మబలికి ఈ నెల 7న ఆమె ఇంట్లో పూజలు చేశారు. పూజ తరువాత ఆ వస్తువులను మూటగట్టి ఇచ్చారు. తర్వాత ఆమె ఐదు సార్లు తాళి కట్టించుకుని, తమతోనే ఐదుసార్లు కలిస్తే, దోషం పోతుందని చెప్పారు. వారి వక్రబుద్ధిని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తండ్రీ, కొడుకులను కటకటాల్లోకి నెట్టారు.