నకిలీ బ్యాంకు బ్రాంచి పెట్టాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

నకిలీ బ్యాంకు బ్రాంచి పెట్టాడు..

March 29, 2018

బ్యాంకింగ్ మోసాల్లో కనీవినీ ఎరగని మోసమిది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లు బ్యాంకులకు పట్టుకుచ్చుటోపీలు పెడితే ఇతగాడు కాస్త ముందుకెళ్లి ఏకంగా ఓ నకిలీ బ్యాంకు బ్రాంచినే ఏర్పాటు చేశాడు. ఉత్తరప్రదేశ్¡‌లోని బలియా జిల్లా ఫెంఫ్నా పట్టణంలో ఈ ముచ్చట జరిగింది.బాదాయూకు చెందిన అఫక్ అహ్మద్ కష్టపడితే సంపాయంచలేమని ఈ దగాకు పాల్పడ్డాడు. ములాయం నగర్‌లో కర్ణాటక బ్యాంకు బ్రాంచిని తెరిచేశాడు. వినోద్ కుమార్ కంబాలి పేరుతో ఆధార్ గట్రా సంపాదించాడు. తర్వాత బ్యాంకులో ఉండాల్సిన మగ్రిని సిద్ధం చేసుకున్నాడు. చెక్కు బుక్కులు, పాస్ బుక్కులు, ఓచర్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్లు అన్నీ తెచ్చుకున్నాడు. తానే మేనేజర్ అన్నాడు. నెలకు 32 వేలకు ఇంటిని అద్దెకు తీసుకుని బ్యాంకును ప్రారంభించాడు. స్థానికులు నిజమేనేమో అని నమ్మి 15 ఖాతాలు తెరిచారు. కనీస డిపాజిట్ వెయ్యి అంట. కొందరు ఫిక్స్డ్ డిపాజిలు కూడా చేశారు. ఈ బ్రాంచిపై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి ఢిల్లీలోని కర్ణాటక బ్రాంచ్ వాళ్లకు ఫోన్లో విషయం చెప్పడంతో నకిలీ బ్యాంకు ఆటకట్టయింది. బుధవారం అరెస్  1.37 లక్షల స్వాధీనం చేసుకున్నారు.