ఈ చంద్రబాబు దొరికాడు.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు బుక్కయ్యాడు - MicTv.in - Telugu News
mictv telugu

ఈ చంద్రబాబు దొరికాడు.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు బుక్కయ్యాడు

October 14, 2018

కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న  ఆ చంద్రబాబు దొరికాడు. అచ్చం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని పోలినట్లు ఉన్న ఆ వ్యక్తిని టీవీ9 రిపోర్టర్ రోహిత్ కనిపెట్టేసి లక్ష రూపాయల రివార్డు కొట్టేశాడు. డూప్ చంద్రబాబును పట్టిస్తే ఈ రివార్డ్ ఇస్తానని దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించడం తెలిసిందే.

హోటల్లో సర్వ్ చేస్తున్న ‘చంద్రబాబు’ ఆచూకీ కనిపెట్టానని రోహిత్ ట్వీట్ చేశాడు. దీనికి ఆర్జీవీ థ్యాంక్ చెబుతూ రోహిత్ బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపిస్తే… లక్ష రూపాయలు వేస్తానని ట్విట్ చేశాడు. ‘చంద్రబాబు’ దొరకడతో అతనికి తాను నిర్మిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో చంద్రబాబు పాత్రను పోషించే వ్యక్తి దొరికేశాడని వర్మ సంబరపడుతున్నారు. కాగా రివార్డు సొమ్ము తనకు వద్దని రోహిత్ చెప్పాడు. ‘కానీ నేను బహుమతి కోసం చేయలేదు ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి నాకు తెలుసు కాబట్టి మీరు లక్ష రూపాయలు ఇస్తే ఎవరికైనా పేదలుకి ఉపయోగపడుతుంది అని చేశాను. మీరు ఇస్తాను అన్న లక్ష రూపాయలు కొండగట్టు బస్ ప్రమాదం లో చనిపోయిన వాళ్ల కుటుంబాలలో 4 పేద కుటుంబాలకు ఇవ్వాలి అనుకుంటున్నా’ అని అన్నారు.

etrt

‘చంద్రబాబు’ వివరాలు ఇవీ..

బాబును పోలిని చంద్రబాబు పేరు ప్రభు అంట. అతడు గతంలో త్రయంబకేశ్వర్‌లో హోటల్లో పని చేశాడు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడు. వర్మ టీం ఇప్పటికే అతణ్ని సంప్రదించి లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం బుక్ చేసుకుందని, రెండు లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.