గూగుల్‌పే‌‌లో ఆశపడుతున్నారా.. ఆమెలా మోసపోవద్దు..! - MicTv.in - Telugu News
mictv telugu

గూగుల్‌పే‌‌లో ఆశపడుతున్నారా.. ఆమెలా మోసపోవద్దు..!

October 18, 2019

Google Pay.

హైదరాబాద్ నగరంపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. అత్యాశకు పోయిన వారికి  డబ్బును ఎరగా చూపి లక్షల్లో దోచేస్తున్నారు. గూగుల్ పే రూపంలో ఆఫర్లు ప్రకటించి తర్వాత భారీగా నగదు దోచేస్తున్నారు.  తాజాగా సైబర్ నేరాలపై నిఘా పెట్టిన పోలీసులు నమ్మలేని నిజాలను వెల్లడించారు. కేవలం ప్రతి రోజూ ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకు కనీసం రూ. 10 లక్షల వరకు మోసం చేస్తున్నట్టు వెల్లడించారు. 

ఇటీవల మమత అనే మహిళకు ఓ వ్యక్తి ఫోన్ చేసి గూగుల్ ఫే కస్టమర్లకు పండగ ఆఫర్లు ప్రకటించిందని చెప్పాడు. రూపాయి తాము చెప్పిన ఖాతాకు బదిలీ చేస్తే వెంటనే రెండు రూపాయలు వస్తాయని నమ్మించాడు. అది విన్న ఆమె ముందుగా రూ.10  జమ చేసింది. వెంటనే ఆమె ఖాతాలోకి రూ. 20 జమ అయ్యాయి. తర్వాత నమ్మకం కుదిరాక ఒక్కసారిగా తన ఖాతాలో ఉన్న రూ. 1.10 లక్షలు జమ చేసింది. ఆ తర్వాత డబ్బులు తిరిగి రాలేదు. ఫోన్ చేసిన వ్యక్తి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. వెంటనే తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. 

దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎవరూ ఇటువంటి వాటికి ఆశపడి డబ్బులు వదులుకోవద్దని సూచించారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, వైజాగ్‌, విజయవాడ, నోడియా,ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఇటువంటి సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్టు చెప్పారు. ఓఎల్‌ఎక్స్ పై కూడా నేరగాళ్లు కన్నేసినట్టు వెల్లడించారు. పాత సామాన్లను కొంటామని చెప్పి గూగుల్‌ పే ద్వారా లింక్ పంపిస్తామని.. దాన్ని క్లిక్ చేయాలని చెబుతారు. అలా చేసిన వెంటనే ఖాతాలోని సొమ్ము కాజేస్తున్నట్టు వెల్లడించారు.