శ్రీముఖిపై తప్పుడు వార్తలు.. ఆంగ్లపత్రికపై తల్లి ఫిర్యాదు.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీముఖిపై తప్పుడు వార్తలు.. ఆంగ్లపత్రికపై తల్లి ఫిర్యాదు..

August 29, 2019

Srimukhi.........

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో వున్న యాంకర్ శ్రీముఖి పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు హల్‌చల్ చేస్తున్నాయి. బిగ్‌బాస్ ఆటలోని కొన్ని సంఘటనలను తీసుకుని రకరకాల పుకార్లు రాస్తున్నారు.  ఈ నేపథ్యంలో శ్రీముఖిపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆమె తల్లి లతాశ్రీ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ట్విటర్‌లో నకిలీ అకౌంట్ల ద్వారా పెట్టే పోస్టుల ఆధారంగా పత్రికలో వార్తలు రాస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీముఖిని టార్గెట్ చేస్తున్నారని.. తన కుమార్తెపై తప్పుడు వార్తలు ప్రచురించిన పత్రికపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి నిరాధార పుకార్లు సృష్టిస్తున్నవారిని శిక్షించాలని అన్నారు. 

ఈ విషయమై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. ‘గత రెండు వారాలుగా కొందరు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి బిగ్ బాస్ హౌజ్ షోలో కాంటెస్టెంట్‌గా ఉన్న మా అమ్మాయి శ్రీముఖిపై అదే పనిగా బ్యాడ్ కామెంట్స్ పోస్ట్ చేస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను నిశితంగా గమనిస్తున్నా. కొద్ది రోజులుగా ఇది మితిమీరడంతో ఈ నకిలీ ఖాతాదారులపై, వారు చేస్తున్న బ్యాడ్ కామెంట్లపై ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. బిగ్ బాస్ షోలో అందరిలో స్ట్రాంగ్ కాంటెస్టెంట్‌గా ఉన్న శ్రీముఖిని ఏదోలా బ్యాడ్ చేసి ఆమె గెలుపును అడ్డుకోవాలని కొన్ని దుష్ట శక్తులు కుట్రలు పన్నాయి. కొన్ని పేయిడ్ బ్యాచ్‌లు కుమ్మక్కయ్యాయనిపిస్తోంది. ప్రస్తుతం అదే పని చేస్తున్నారు. శ్రీముఖిని ఆత్మీయంగా, తమ సొంత మనిషిలా ఆదరించి, అభిమానించే వారందరూ ఈ విషయాలను గమనించాలని కోరుతున్నా’ అని తెలిపారు.