నాకు కరోనా రాలేదు, వాళ్లది శునకానందం..కత్తి మహేశ్ - MicTv.in - Telugu News
mictv telugu

నాకు కరోనా రాలేదు, వాళ్లది శునకానందం..కత్తి మహేశ్

July 2, 2020

nvn gth

గత కొన్ని రోజులుగా సినీ దర్శకుడు, నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ కు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతోన్న సంగతి తెల్సిందే. ఈ ప్రచారంపై మహేష్ తీవ్రంగా స్పందించారు. తనకు కరోనా పాజిటివ్‌ అని తేలలేదని.. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. తనకు కరోనా సోకిందమోనని కొంత మంది మిత్రులు ఫోన్‌ చేసి అడుగుతున్నారని.. ఇప్పటి వరకైతే తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.

ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘కొన్ని రోజుల కిత్రం చేసిన టెస్ట్‌ల్లో నాకు కరోనా నెగిటివ్‌గా తేలింది. నాకు కరోనా రావాలని కోరుకుంటున్నవారే.. ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారేమో. నాకు కరోనా సోకిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటివారు శునకానందం మానుకోవాలి. ఏదైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి. ఒకరి ఆరోగ్యం బాగోలేదని ప్రచారం చేసే చర్యలు హర్షించదగ్గవి కావు. ఒకవేళ నాకు కరోనా వచ్చినా అధైర్య పడే రకాన్ని కాదు. కరోనాతో పోరాడి నా ఆరోగ్యాన్ని నేను వెనక్కి తెచ్చుకుంటాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఫోన్‌ చేసి నా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న మిత్రులకు నా ధన్యవాదాలు’ అని ఆ వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.