కరోనా పాస్, కరోనా పాస్.. రూ. 300లే - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా పాస్, కరోనా పాస్.. రూ. 300లే

May 16, 2020

Fake

లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తాజాగా కొన్ని సడలింపులు ఇవ్వడంతో సొంత ఊళ్లకు వెళ్లడానికి చాలా మంది సిద్దమౌతున్నారు. పోలీసులు ప్రత్యేక పాసులు మంజూరు చేస్తూ.. సరైన కారణం చెప్పిన వారికి అవకాశం కల్పిస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకొని అక్రమార్కులు రెచ్చిపోయారు. ఫేక్ పాసులతో రోడ్లపైకి వచ్చి కూరగాయల్లా విక్రయించేస్తున్నారు. గుజరాత్‌లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

రాజ్‌కోట్‌లో 17 మంది కలిసి ముఠాగా ఏర్పడి  ఈ పాసులను విక్రయిస్తున్నారు. పోలీసులు ఇచ్చిన వాటిలా ఫేక్ పాసులు సృష్టించారు. ఒక్కో పాసుకు రూ. 300 తీసుకొని వీటిని అందజేస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగారు. పాసులు విక్రయిస్తుండగా పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున పాసులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ ప్రారంభించి ఇంకా ఎవరైనా ఇలాంటి దందా చేస్తున్నారో ఆరా తీస్తున్నారు.