హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు..  - MicTv.in - Telugu News
mictv telugu

హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు.. 

October 29, 2019

Hero Vijay.

తమిళ స్టార్ హీరో విజయ్‌ నివాసంలో బాంబు పెట్టినట్టు చెన్నై కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చెన్నైలోని ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా బాంబు ఆనవాళ్లు కనిపించలేదు. తర్వాత అతని తండ్రి నిర్మాత చంద్రశేఖర్ నివాసంలోనూ బాంబు స్వ్వాడ్ పరిశీలించగా అక్కడా ఏమి లభించలేదు. దీంతో ఆకతాయిల పనిగా పోలీసులు భావించారు. ఈ విషయం తెలిసిన విజయ్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. 

కంట్రోల్ రూంకు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయగా.. అళపాక్కమ్ ప్రాంతంలోని పోరూర్ నుంచి వచ్చినట్టుగా తేలింది. వెంటనే ఆ వ్యక్తిని  అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. ఇంకా అతను అలాగే చెబితే తమ స్టైల్‌లో విచారణ చేపడతామని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం అతని ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమా దీపావళి కానుకగా వచ్చి గ్రాండ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే.