ఓ గిరిజనుడు చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. ఓ రేప్ కేసులో ఇరుక్కొని సుమారు 666 రోజులు జైల్లో ఉన్నాడు. చివరికి అతను నిర్దోషి అని తేలడంతో దేవుడి దయ వల్ల బయటపడ్డాడు. తర్వాత తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వంపై పోరాటానికి దిగాడు.
మద్యప్రదేశ్ ఘోడా ఖేడా ప్రాంతానికి చెందిన కంతూ అలియాస్ కంతులాల్..మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఓ మహిళను రేపు చేశారని కేసు నమోదయ్యింది. ఈ కేసులో అతని రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. ఆక్టోబర్ 2018లో జైలుకు వెళ్లిన అతను డిసెంబర్ 23 2020 వరకు శిక్ష అనుభవించాడు. తర్వాత కాలం కలిసిరావడంతో కుంతూ నిర్దోషి అని తేలాడు. చివరికు అధికారులు అతడిని రిలీజ్ చేశారు. బయటకొచ్చిన కుంతూ అన్యాయంగా రెండేళ్లపాటు జైళ్లో పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కాడు.
అన్యాయంగా తనను జీవితాన్ని తలకిందులు చేశారని, చేయని తప్పుకు రెండేళ్ళు జైలు వేశారని కోర్టులో పిటిషన్ వేశాడు. “ఏ నేరం చేయనప్పటికీ, నేను పోలీసుల వేధింపులను ఎదుర్కొన్నాను మరియు నా జీవితంలో రెండేళ్లు జైలులో గడిపాను, ఇది నా కుటుంబాన్ని నాశనం చేసింది. ఇప్పుడు నేను బయటికి వచ్చాను, నా పిల్లలకు ఆహారం ఏర్పాటు చేయడం నాకు కష్టంగా ఉంది. దేవుడు ప్రసాదించిన జీవితంలో ఎన్నో విలువైన క్షణాలను కోల్పోయాను” అని అతడు పిటిషన్లో పేర్కొన్నాడు. అందుకు పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల నుంచి .రూ.10,006.02 కోట్లు నష్టపరిహారం దావా వేశాడు. దీనిపై కోర్టు జనవరి 10న విచారణ చేపట్టనుంది.