టిక్‌టాక్ ప్రో వచ్చింది..డౌన్ లోడ్ చేస్తే అంతే సంగతి! - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్ ప్రో వచ్చింది..డౌన్ లోడ్ చేస్తే అంతే సంగతి!

July 5, 2020

 

nfjj

ఇటీవల కేంద్రప్రభుత్వం టిక్ టాక్ తో సహా చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌ను నిషేధించిన సంగతి తెల్సిందే. దీంతో భారత్ లో కొన్ని కోట్లలో ఉన్న టిక్ టాక్ యూజర్లు షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా టిక్‌టాక్‌ ప్రో అంటూ సోషల్‌ మీడియాలో ఓ మెసెజ్‌ వైరల్ అవుతోంది. 

ఆ మెసేజ్ లో టిక్ టాక్ ప్రో ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఓ లింక్ కూడా ఉంది. దీంతో టిక్‌టాక్‌ ప్రేమికులు ఆ లింక్ క్లిక్ చేసి అందులో ఉన్న ఫైల్ ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. అయితే ఈ నకిలీ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం కొంపముంచుతుందని సైబర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ లింక్ లో ఉన్న ఫైల్ డౌన్ లోడ్ చేసుకుంటే మాల్వేర్‌ మీ ఫోన్‌లోకి వచ్చేస్తుందని, దాంతో ఫోన్‌ హ్యకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి టిక్‌టాక్‌ యాప్‌ 75MB సైజ్, ఈ మెసేజ్ లో చూపిస్తున్న టిక్‌టాక్‌ ప్రో యాప్‌ 90 MB వరకు ఉంది. నెటిజన్లు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోకూడదని సూచిస్తున్నారు. భారత్ లో టిక్ టాక్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొందరు హ్యాకర్లు ఇలా చేస్తున్నారని వివరించారు.