తెలంగాణలో నకిలీ ఓటర్లను తొలగించాం.. ఈసీ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో నకిలీ ఓటర్లను తొలగించాం.. ఈసీ

October 8, 2018

తెలంగాణలో నకిలీ ఓటరుకార్డులకు చెక్ పెట్టింది ఎన్నికల సంఘం. ఈ క్రమంలో నకిలీ ఓటర్ కార్డులను తొలగించామని ఎన్నికల సంఘం, హైకోర్టుకు తెలిపింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని పిటిషన్‌ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఎన్నికల సంఘం హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ విచారణలో బోగస్ ఓట్లన్ని తొలగించామని ఈసీ, హైకోర్టుకు తెలిపారు. ఈ నెల 12న ఓటర్ల తుది జాబితాతో పాటు నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలిపింది. ఓటర్ల జాబితాలో ఫిర్యాదులపై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలను వినిపించారు.Fake voters in Telangana, Election Commission ..