ఫలక్‌నామాకు బొంత ఎల్లయ్య బాంబు దమ్కీ - MicTv.in - Telugu News
mictv telugu

ఫలక్‌నామాకు బొంత ఎల్లయ్య బాంబు దమ్కీ

November 29, 2017

హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచపారిశ్రామిక సదస్సుకు వచ్చిన అతిథులకు ఫలక్‌నామా ప్యాలెస్‌లో నిన్న రాత్రి విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాంకా, నరేంద్రమోడీ మిగతా అతిథులతో ప్యాలెస్‌లో డిన్నర్ చేస్తున్న సమయంలో సరిగ్గా రాత్రి 8.43 లకు పోలీస్ కంట్రోల్ రూంకు ఓ ఫోన్ వచ్చింది.

‘ఇవాంకా, మోడీ కూర్చున్న స్థలంలో బాంబు పెట్టానని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఈవిషయంపై అప్రమత్తమైన పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచి, ప్యాలెస్ చుట్టూ సీక్రెట్ గా తనిఖీలు చేశారు. వచ్చింది ఫేక్ కాల్ అని తేలడంతో…చేసిన వ్యక్తికోసం ఆరా తీయగా ..అతను హైదారాబాద్ లాలాగూడకు చెందిన బొంత ఎల్లయ్య(60) గా గుర్తించారు. అతను ఈ మద్యే ఎర్రగడ్డ దవాఖానా నుంచి డిచార్జ్ అయిన మానసిక రోగిగా పోలీసులు గుర్తించారు. మీడియాలో ఎక్కువగా ఫలక్ నామా ప్యాలెస్ గురించి వార్తలు విన్న ఎల్లయ్య ఈకాల్ చేసినట్టు  పోలీసులు విచారణలో తెలుసుకున్నారు.