మన కరెన్సీ రూపాయి విలువ డాలరుతో పోలిస్తే భారీగా పడిపోయింది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో చరిత్రలో తొలిసారిగా అత్యంత కనిష్ట స్థాయి రూ. 77.41 కి చేరింది. క్రితం ట్రేడింగ్‌తో 76.93 తో పోలిస్తే 0.48 శాతం పడిపోయింది. చివరిసారి మార్చి 7న రూపాయి విలువ రూ. 76.98 గా ఉంది. కాగా, రూపాయి పతనానికి వివిధ కారణాలు ఉన్నాయి.
ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడంతో ఇన్వెస్టర్లు తమ ఈక్విటీ షేర్లను భారీగా విక్రయించారు. కరోనా కొత్త వేరియంట్లు, పెరిగిన క్రూడాయిల్ ధరలు, మాంద్యంపై ఇంగ్లాండ్ బ్యాంకు హెచ్చరికలు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండడం వంటి కారణాలతో పెట్టుబడిదారులు తరలిపోతున్నారు. ఈ ధోరణి కొంతకాలం సాగుతుందని, వాణిజ్యలోటు పెరుగుతుండడంతో రూపాయి విలువపై మరింత ఒత్తిడి పెరుగుతుందని ఆర్ధిక విశ్లేషణా సంస్థలు చెప్తున్నాయి.