పడిపోయిన పసిడి ధర.. ఎంతో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

పడిపోయిన పసిడి ధర.. ఎంతో తెలుసా?

March 14, 2022

ంేనద

బంగారం కొనాలని అనుకుంటున్న ప్రియులకు శుభవార్త. పసిడి రేటు పడిపోయింది. బంగారం నేలచూపులు చూస్తోంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొన్ని రోజులు కొండెక్కిన ధరలు..ఈరోజు తగ్గాయి. ఎంసీఎక్స్‌లో పది గ్రాముల బంగారం రూ. 340 తగ్గి రూ. 52,470 చేరింది. వెండి ధర కిలో రూ. 74,700గా ఉంది.

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 310 తగ్గి రూ. 48,100 చేరింది. 24 కేరట్ల బంగారం రూ. 340 తగ్గి రూ. 52,470 వద్ద నిలిచెంది. కిలో వెండి రూ. 74,700 పలుకుతోంది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతూ రూపాయి విలువను హరించేస్తున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్ 129 డాలర్లకు చేరుకోవడంతో అది ఫారెక్స్ మార్కెట్లో రూపాయిపై ఒత్తిళ్లకు దారితీసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ జీవిత కాలంలో అత్యంత కనిష్ఠానికి చేరింది.