ఎమ్మార్వో హత్య కేసు.. సురేశ్ కుటుంబానికి రైతు సాయం - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మార్వో హత్య కేసు.. సురేశ్ కుటుంబానికి రైతు సాయం

November 12, 2019

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసిల్దార్ విజయారెడ్డి హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. తమకు న్యాయం చెయ్యకపోతే తామూ పెట్రోల్ పోస్తామని పలువురు రైతులు ఎమ్మార్వో ఆఫీసులకు వెళ్తున్నారు. విజయారెడ్డిని చంపిన సురేశ్‌తోపాటు కాలిన గాయాలతో ఆమె డ్రైవర్ కూడా చనిపోయిన సంగతి విదితమే. సురేశ్ చనిపోవడంతో అతని కుటుంబానికి దిక్కులేకుండా పోయింది.

mro case.

ఈ నేపథ్యంలో సురేశ్ కుటుంబాన్ని ఆదుకోడానికి ఓ రైతు ముందుకొచ్చాడు.బాలాపూర్‌ మండలం గుర్రంగూడకు చెందిన రైతు జక్కిడి ముత్యంరెడ్డి.. సురేశ్ కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం చేశాడు. రెవెన్యూ అధికారుల తీరుతో తాను కూడా కష్టాలు పడ్డానని ముత్యం రెడ్డి చెప్పాడు. ముత్యం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం  తుర్కయాంజాల్‌లో అతడు కొంత భూమి కొని మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే మ్యుటేషన్ కోసం వీఆర్వో శంకర్ రూ. లక్ష డిమాండ్ లక్ష రూపాయలు డిమాండ్‌ చేయగా రూ. 70 వేలుకు బేరం కుదిరింది. డిజిటల్‌ సంతకం తర్వాత వీఆర్‌వో లంచం ఇవ్వాలన్నాడు. ముత్యం రెడ్డి ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు శంకర్‌ను గతన నెల 3న అరెస్ట్ చేశారు.  తర్వాత ముత్యం రెడ్డి కొన్న భూమి మిస్‌ మ్యాచ్‌ అవుతోందని అధికారులు అతనికి నోటీసు ఇచ్చారు. మొత్తానికి గత నెల 26న మ్యుటేషన్ పూర్తయింది. అ కేసులో జిల్లా కలెక్టర్..విజయారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.