Home > Featured > దారుణం.. శ్మశానంలో దాడి, సగం కాలిన శవంతో బంధువుల పరుగు

దారుణం.. శ్మశానంలో దాడి, సగం కాలిన శవంతో బంధువుల పరుగు

vjdgh

కరోనా రాకతో మనుషుల్లో మానవత్వం మాయమైనట్టుగానే ఉంది. మనిషికి మనిషికి మధ్య భౌతికి దూరం ఉండాలని వైద్య నిపుణులు చెప్పిన ఆ ఒక్క పదంతో మనుషుల్లో మరో కోణం బయటకు వచ్చింది. భూమిలో పాతిపెడితే కూడా కరోనా రావొచ్చని వెర్రి ఆలోచనలతో మనుషులు ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే తెలుస్తోంది. తాజాగా కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు స్థానికులు అడ్డుపడ్డి గొడవ చేశారు. దీంతో బంధువులు సగం కాలిన మృత దేహాంతో పారిపోవాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. ఈ దారుణ ఘటన జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకుంది. దొడా జిల్లాకు చెందిన 72 ఏళ్ల వ్యక్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కరోనాతో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

దీంతో అతడి అంత్యక్రియలను ఇంట్టి వద్ద నిర్వహించేందుకు బంధువులు అధికారుల అనుమతి కోరారు. అయితే స్థానిక డొమన ప్రాంతంలోనే కర్మకాండలు నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు. దానికి అంగీకరించిన బంధువులు ఓ రెవిన్యూ అధికారి, ఇద్దరు పోలీసులు వెంటరాగా స్థానికంగా ఉన్న శ్మశానానికి తీసుకువెళ్లారు. అక్కడ చితికి నిప్పంటించారు. ఆ తరువాత కొద్ది సేపటికే స్థానికులు గుంపులుగా అక్కడికి దండెత్తడానికి వచ్చినట్టే వచ్చారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహించరాదంటూ మృతుడి ఇద్దరు కుమారులు, భార్యతో గొడవకు దిగారు. వారిపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారని తెలుస్తోంది. దీంతో భయపడిపోయిన బంధువులు సగం కాలిన మృత దేహంతో అక్కడి నుంచి పారిపోయి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ తరువాత అధికారుల సహాయంతో మరో శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆవేద వ్యక్తంచేశారు. ‘ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. దాడికి దిగుతున్న గుంపు నుంచి మమ్మల్ని ఆంబులెన్స్ డ్రైవర్ కాపాడారు. మా వెంట వచ్చిన ఇద్దరు పోలీసులు స్థానికులను అదుపు చేయలేకపోయారు. రెవన్యూ అధికారి కూడా అక్కడ కనిపించలేదు’ అని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.

Updated : 2 Jun 2020 10:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top