ఒక్క ఇంజక్షన్‌తో  కుటుంబ నియంత్రణ.. ఆరేషన్‌తో పనేలేదు - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్క ఇంజక్షన్‌తో  కుటుంబ నియంత్రణ.. ఆరేషన్‌తో పనేలేదు

November 20, 2019

పిల్లలు కలగకుండా ఉండాలంటే ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణ అంటే ఆపరేషన్ ఒక్కటే మార్గంగా ఉండేది. పురుషులు అయితే వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ఆపరేషన్ లేకుండానే సంతానోత్పత్తిని నియంత్రించ వచ్చు. కేవలం ఒక్క ఇంజక్షన్‌తో 13 ఏళ్లపాటు సంతానం కలగకుండా ఆపే పద్దతిని భారత వైద్య పరిశోధనా మండలి అందుబాటులోకి తెచ్చింది. 

సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.ఎస్.శర్మ నేతృత్వంలోని నిపుణుల బృందం దీన్ని అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే దీని కోసం 303 మందిపై పరిశోధనలు కూడా నిర్వహించారు. 97.3 శాతం సానుకూల ఫలితాలు రావడంతో ఈ ఇంజక్షన్‌కు ఆమోదం తెలిపేందుకు ఔషధ నియంత్రణ మండలి ముందుకు వచ్చింది. మరో 7 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది.దీంతో ఇది ప్రపంచంలోనే తొలి సంతాన నిరోధక ఇంజెక్షన్‌‌గా రికార్డు సృష్టించనుంది. దీనిపై గతంలో అమెరికా కూడా పరిశోధనలు చేసినప్పటికీ సానుకూల ఫలితాలు రాకపోవడంతో ఆపేసింది. 

Injection.

ఇంజక్షన్ ఎలా చేస్తారు..?

పురుషుల వృషణాల నుంచి వీర్యకణాలను మూత్రనాళానికి చేరవేసే నాళికకు ముందుగా  మత్తుమందు ఇస్తారు. ఆ తర్వాతఈ ఇంజెక్షన్‌ చేస్తారు. అయితే ఈ ప్రక్రియ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంటుంది. ఈ ఇంజక్షన్ అందుబాటులోకి వస్తే మాత్రం ఇక ఆపరేషన్లతో పాటు పనిలేకుండా సుమారు 13 ఏళ్ల పాటు సంతానోత్పత్తిని నియంత్రించుకోవచ్చు. కాగా 1970లోనే ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రొఫెసర్‌ సుజయ్‌కుమార్‌ గుహ కనుగొన్నారు. 1984 నుంచే ఆ పాలిమర్‌తో సంతాన నిరోధక ఇంజెక్షన్‌ అభివృద్ధిపై ఐసీఎంఆర్‌ పరిశోధనలను ప్రారంభించింది.