‘ఆడదే ఆధారం’ విసు ఇక లేరు - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆడదే ఆధారం’ విసు ఇక లేరు

March 23, 2020

director visu

కుటుంబ కథా చిత్రాలతో ఆకట్టుకున్న ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు విసు(74) ఇక లేరు. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు వారికి సుపరిచితుడైన ఆయన కిడ్నీ సమస్యతో చనిపోయారు. ఆదివారం చెన్నైలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విచారు. విసు  మృతితో సినీపరిశ్రమలో విషాదం నెలకొంది. విసుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 

 ‘ఆడదే ఆధారం’ సినిమాతో ఆయన తొలిసారి టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’కు దర్శకత్వం వహించి నటించారు. ‘గాడ్ ఫాదర్’, ‘అరుణాచలం’ తదితర చిత్రాలతో నటనతో మెప్పించారు. 60కిపైగా సినిమాల్లో నటించిన విసు దివంగత దర్శకుడు కె. బాలచందర్‌ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు.  ‘కుడుంబం ఒరు కడంబం’ నటుడిగా ఆయన తొలి సినిమా. విసు దర్శకత్వంలో వచ్చిన తమిళ ‘సంసారం ఒక చదరంగం’ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది.