సినీ పరిశ్రమలో మరో విషాదం...ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి.! - MicTv.in - Telugu News
mictv telugu

సినీ పరిశ్రమలో మరో విషాదం…ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి.!

March 9, 2023

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు సతీష్ కౌషక్ కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. తమ 45 ఏళ్ల స్నేహం ఈరోజు ముగిసిందంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. సతీష్ కౌశిక్ 67 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. అంతకుముందు, సతీష్ కౌశిక్ కోవిడ్ బారిన పడ్డాడు. అప్పటి నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

మార్చి 7న, సతీష్ కౌశిక్ తన స్నేహితులతో కలిసి హోలీ ఆడుతున్న కొన్ని చిత్రాలను ట్వీట్ చేశారు. ఈ చిత్రాలలో అతను ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్, సినీ నటి మహిమా చౌదరి, సినీ నటుడు అలీ ఫజల్, సినీ నటి రిచా చద్దాతో కలిసి హోలీ సంతోషంగా జరుపుకున్నారు.

100కి పైగా సినిమాల్లో పనిచేశారు

హర్యానాలోని మహేంద్రగఢ్‌లో ఏప్రిల్ 13, 1956లో జన్మించిన సతీష్ కౌశిక్ 1983లో వచ్చిన ‘మాసూమ్’ చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత దాదాపు 100 సినిమాలకు పనిచేశాడు. 1993లో, కౌశిక్ ‘రూప్ కి రాణి చోరోన్ కా రాజా’తో చలనచిత్ర దర్శకత్వ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. దాదాపు డజను చిత్రాలకు దర్శకత్వం వహించాడు.