స్వర్ణకమలం నృత్య దర్శకుడు కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

స్వర్ణకమలం నృత్య దర్శకుడు కన్నుమూత

October 13, 2019

‘స్వర్ణకమలం’, ‘రాధాగోపాలం’ వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలకు నృత్యాలు సమకూర్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్(82) ఇకలేరు. ఆదివారం ఉదయం చెన్నైలోని టినగర్‌లో ఉన్న ఆయన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈరోజు సాయంత్రం చెన్నైలో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. 

choreographer sreenu.

కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన లక్ష్మీ దేవమ్మ, నారాయణప్ప దంపతులకు శ్రీను మాస్టర్ జన్మించారు. 1956లో ప్రముఖ కొరియోగ్రాఫర్ హీరాలాల్ మాస్టర్ దగ్గర శిష్యుడిగా చేరారు. 1969లో నిర్మాత డూండి రూపొందించిన ‘నేనంటే నేనే’ చిత్రంతో డాన్స్‌ మాస్టర్‌గా అరంగేట్రం చేశారు. తర్వాత ‘మహాబలుడు’, ‘భక్తకన్నప్ప’, ‘ఎదురులేని మనిషి’, ‘యుగపురుషుడు’, ‘దొరబాబు’, ‘యుగంధర్’ వంటి చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎనిమిది భాషల్లోని చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ‘స్వర్ణకమలం’, ‘రాధాగోపాలం’, ‘శ్రీరామరాజ్యం’ సినిమాలకుగాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నంది అవార్డులను అందుకున్నారు. ఇలా ఆయన 1700 సినిమాలకు పైగా నృత్యాలను సమకూర్చారు. ఆయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు విజయ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నారు.