హాస్యనటుడు వేణుమాధవ్‌కు తీవ్ర అస్వస్థత - MicTv.in - Telugu News
mictv telugu

హాస్యనటుడు వేణుమాధవ్‌కు తీవ్ర అస్వస్థత

September 24, 2019

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తెలుగు చిత్రసీమలో హాస్యనటుడిగా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో కుటుంబసభ్యులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. 

venu madhav.

కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పటల్ వైద్యులు తెలిపారు. సినీ నటులు జీవిత-రాజశేఖర్‌లు ఆస్పత్రికి వచ్చి వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మిమిక్రీ కళాకారుడిగా కెరీర్‌ను ప్రారంభించిన వేణుమాధవ్… ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో సంప్రదాయం చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. హంగామా సినిమాతో కథానాయకుడిగా మారారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని కథానాయకులందరితోనూ ఆయన నటించారు.