వీడియో : పాట పాడుతూ చనిపోయిన ప్రముఖ సింగర్ - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : పాట పాడుతూ చనిపోయిన ప్రముఖ సింగర్

May 31, 2022

కేరళకు చెందిన ప్రముఖ గాయకుడు ఇడవ బషీర్ (78) శనివారం పాట పాడుతూ హఠాన్మరణం చెందారు. ప్రముఖ మ్యూజిక్ ట్రూప్ భీమాస్ బ్లూ డైమండ్ ఆర్కెస్ట్రా 50 వ వార్షికోత్సవం సందర్భంగా అలప్పుళలో ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో ఆయన పాల్గొన్నారు. హిందీలోని పాట ‘మానో హో తుమ్’ను పాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. నిర్వాహకులు వెంటనే స్పందించి బషీర్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో నిర్వాహకులతో పాటు ప్రేక్షకులు శోకసంద్రంలో మునిగిపోయారు. బషీర్ అకాల మరణం పట్ల సీఎం పినరయి విజయన్ సంతాపం తెలియజేశారు. కేరళ సంగీత, సినీ ప్రపంచానికి ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. ప్రముఖ గాయని చిత్ర కూడా బషీర్ ఆకస్మిక మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. కాగా, బషీర్ అంత్యక్రియలను సోమవారం నిర్వహించారు.