టాలీవుడ్ హబ్‌గా కర్నూలు.. జగన్‌ను కలుస్తానన్న ప్రముఖ నిర్మాత - MicTv.in - Telugu News
mictv telugu

టాలీవుడ్ హబ్‌గా కర్నూలు.. జగన్‌ను కలుస్తానన్న ప్రముఖ నిర్మాత

March 30, 2022

bhfgbhfgh

తెలుగు చిత్ర పరిశ్రమకు కేంద్రంగా ఉండే అన్ని హంగులూ కర్నూలు పట్టణానికి ఉన్నాయని ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కర్నూలు న్యాయ రాజధానికిగా నిర్ణయించిన నేపథ్యంలో సినీ హబ్‌గా మలచితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. జిల్లాలో సినిమా షూటింగులకు అనవైన ప్రదేశాలు అనేకం ఉన్నాయన్నారు. తుంగభద్ర నది, నల్లమల అడవులు, శ్రీశైలం, కేసీ కెనాల్, కొండారెడ్డి బురుజు, మంత్రాలయం, నంద్యాల పరిసర ప్రాంతాలు వంటివి షూటింగులకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఏపీలో షూటింగులకు రాయితీలు కూడా ఉన్నందున పరిశ్రమకు మరింత లాభిస్తుందనీ, చిన్న పాటి ఫిలింసిటీని కూడా కర్నూలులో ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఈ విషయంపై ఉగాది తర్వాత ప్రభుత్వ పెద్దలను, సీఎం జగన్‌ను కలుస్తానన్నారు. తాను చెప్పిన అంశం పట్ల టాలీవుడ్ పెద్దలు ఒకసారి ఆలోచించాలని మనవి చేశారు. కాగా, ఏపీ ప్రభుత్వం విశాఖను సినీ హబ్‌గా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో కేఎస్ రామారావు ఈ ప్రతిపాదన తేవడం ప్రాధాన్యం సంతరించుకుంది.