ప్రఖ్యాత గాయని పద్మభూషణ్ వాణీ జయరాం ఇక లేరు. ఆమె కాసేపటి క్రితం చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, ఒరియా, గుజరాతీ తదితర భాషల్లో 20వేలకు పైగా పాటలు పాడారు. 50 ఏళ్ల కెరీర్లో మరపురాని పాటతో అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు.
ఆమె తమిళనాడులో వెల్లూరు జన్మించారు. తల్లి వీణా విద్వాంసురాలు. వాణి జయరాం ఎనిమిదో ఏటనే రేడియోలో పాడారు. అంతులేని కథ, స్వాతికిరణం, స్వర్ణకమలం, శ్రుతిలయలు, సర్కస్ రాముడు, సీతాకోకచిలుక వంటి అనేక హిట్ చిత్రాల్లో ఆమె పాటలు పాడారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమెకు విభూషణ్ పురస్కారం ప్రకటించింది. జయరాం అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి జరిగింది. ముంబైలో కొన్నాళ్లు ఉన్నారు. బాలీవుడ్ గుడ్డీ మూవీలో పాడిన ‘బోలే రే’ పాటతో ఆమె దశ తిరిగింది.