ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సర్కార్‌కు ఆయన ఝులక్ ఇచ్చారు. ప్రభుత్వం అప్పగించిన టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారు పదవిని సున్నితంగా తిరస్కరించారు. జనవరి 21న హెచ్‌డీపీపీ కార్యనిర్వాహక కమిటీ టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డే మీడియా ఎదుట . ఆ నిర్ణయం వెలువడ్డాక సీఎం జగన్‌ను చాగంటి కలిసి అభినందనలు తెలిపారు. ఇంతలోనే ఏమైందో తెలీదు కానీ సలహాదారు పదవొద్దంటూ చాగంటి ప్రకటించారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారు పదవిని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. టీటీడీకి సలహాలు ఇవ్వడానికి పదవులు అవసరం లేదని..పదవిలో లేకుండా సలహాలు ఇవ్వొచ్చని తెలిపారు.టీటీడీకి తన అవసరం ఎప్పుడొచ్చినా పరుగెత్తుకుంటూ వెళ్లి ముందుంటానని చాగంటి స్పష్టం చేశారు. తనపై ఎంతో నమ్మకం ఉంచిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. చాగంటి నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.