ట్రాఫిక్ వెయిటర్..! - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాఫిక్ వెయిటర్..!

September 7, 2017

ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర  రెడ్ సిగ్నల్ పడంగనే కొంతమంది చేతులల్ల  వస్తువులు పట్టుకొని అమ్ముకుంటుంటరు. దాదాపు ప్రతి సిగ్నల్స్ దగ్గర ఇలాంటి సంఘటను చూస్తుంటాం. తీస్కొండి సార్, అని కారు అద్దాలు కొట్టి మరీ అమ్ముకుంటుంటారు పాపం. వాళ్ల అవతారలు చూసి కొందరైతే గ్లాస్ కూడా దించరు.అయితే  బ్రెజిల్ కు చెందిన ఒకాయన ఇలా అమ్ముకోవడంలో డిఫరెంట్ గా ఆలోచించి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

బ్రెజిల్ కు చెందిన అయిల్టన్ ఓ ఫ్యాక్టరీలో చేసే ఉద్యోగం పోవడంతో ఏం చెయ్యాలో తెలీక  ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర తినుబండారలను అమ్ముడం మొదలు పెట్టాడు.కానీ ఎవ్వరూ అతని అవతారం చూసి మొదట్లో కొనలేదట. ఇలా అయితే లాభం లేదని భావించిన సెల్వ తన రూట్ మార్చాడు. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో వెయిటర్లలా క్లాస్‌లుక్‌తో వీధుల్లోకి వెళ్లడం ప్రారంభించాడు. అతని గెటప్‌ చూసి వచ్చిన వారితో చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ తినుభండారాలు అమ్మడం మొదలుపెట్టాడు. దీంతో అతని దగ్గరికి వచ్చే గిరాకీ పెరిగిపోయింది. గత రెండేళ్లుగా బ్రెజిల్‌ వీధుల్లో క్లాస్‌లుక్‌తో తినుభండారాలు అమ్ముతూ.. ఈ ట్రాఫిక్‌ వెయిటర్‌ తెగ పాపులర్‌ అయిపోయాడు.