కోహ్లీని ముద్దుపెట్టుకోబోయిన కడప యువకుడు.. - MicTv.in - Telugu News
mictv telugu

కోహ్లీని ముద్దుపెట్టుకోబోయిన కడప యువకుడు..

October 12, 2018

భారత్-వెస్టిండీస్ మధ్య హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీకి షాక్ తగిలింది.  ఓ యువకుడు అతణ్ని ముద్దుపెట్టుకోబోయాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని మైదానంలోకి పరుగెత్తాడు. కోహ్లీ వద్దకు వెళ్లి, కౌగిలించుకుని సెల్ఫీ దిగాడు. అంతేకాదు కోహ్లీ చెంపపై ముద్దు పెట్టుకునేందుకు ప్రయ్నతించాడు. అభిమాని తీరుతో కోహ్లీకి దిమ్మ తిరిగింది. ఇంతలో భద్రతా సిబ్బంది ఆ యువకుడి మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.Fan Breaches Security During 2nd Test, Tries To Kiss Virat Kohli In Hyderabad Uppal Rajiv Gandhi Stadium కడప జిల్లాకు చెందిన అహ్మద్ ఖాన్(20) హైదారాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న భారత్- వెస్టిండీస్ రెండో టెస్ట్‌ మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. కోహ్లీ అంటే అతనికి చాలా ఇష్టం అయితే మ్యాచ్ ప్రారంభమై ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ వద్దకు వెళ్లి ఇలా చేయడంలో అందరూ అవాక్కయ్యారు. అయితే అభిమాని చేసిన పనికి ఆటకు అంతరాయం కలగడంతో అంపైర్లు డ్రింక్స్ విరామం ఇచ్చారు. అయితే కోహ్లీకి ఇది మొదటిసారి ఏం కాదు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్‌లో కూడా ఓ అభిమాని సెక్యూరిటీని దాటుకుని కోహ్లీ కాళ్లు మొక్కాడు.