పంత్ పోవాలి..శాంసన్ రావాలి - MicTv.in - Telugu News
mictv telugu

పంత్ పోవాలి..శాంసన్ రావాలి

November 20, 2022

రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపించండి..u-19లో ఓపెనర్‌‌గా అనుభవం ఉంది..మంచిగా రాణిస్తాడు. ఇది పంత్ వరుసుగా విఫలమవుతున్న వేల కొంతకాలంగా వస్తున్న సలహా. దానిని స్వీకరించిన టీం ఇండియా మేనేజ్ మెంట్ న్యూజిలాండ్‌పై రెండో టీ20లో పంత్‌కు ఓపెనర్‌గా ప్రమోషన్ ఇచ్చింది. ఇషాన్ కిషాన్‌‌కు తోడుగా ఆరంభం చేయమని అవకాశం కల్పించింది. రిషబ్ పంత్ మాత్రం తన ప్లాప్ షోను కొనసాగించాడు. ఓపెనర్‌గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలం 13 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో భారత్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాడు. ఇప్పటికే పంత్‌కు అంతులేని అవకాశాలు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. విఫలమవుతున్న రిషబ్ పంత్‌కు అవకాశాలు ఇచ్చి ఇతర ఆటగాళ్లను తొక్కేస్తున్నారని పలువురు క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పుడు మరోసారి పంత్ ఫెయిల్ కావడంతో నెటిజన్లు తిట్టిపారేస్తున్నారు.

మరోవైపు ప్రతిభావంతుడైన సంజూ శాంసన్‌కు మరోసారి తుది జట్టులో దక్కలేదు. దీంతో అతని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్‌‌ను తొక్కేస్తున్నారని మండిపడుతున్నారు. . టీ20 ప్రపంచకప్ కోల్పోయినా.. బీసీసీఐకి సిగ్గురాలేదని చురకలంటిస్తున్నారు.రిషభ్ పంత్ వరుసగా విఫలమవుతున్నా.. అతనికి అండగా నిలుస్తున్నారని, అలాంటి మద్దతు సంజూ శాంసన్‌కు ఇచ్చి ఉంటే రాణించేవాడని చెబుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. కెప్టెన్లు మారుతున్నా.. సంజూ శాంసన్‌ను పక్కనపెట్టడం మాత్రం మారడం లేదని అతని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంజూశాంసన్‌ను టీం ఇండియాకు ఎంపికచేయడం..బెంచ్‌కు పరిమితం చేయడం.. ఇదే జరుగుతుందని కామెంట్ చేస్తున్నారు.