చంద్రబాబు నాయుడుతో పవన్ కల్యాణ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో మాటల యుద్ధానికి దారి తీసింది. ఇక కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన రామ్ గోపాల్ వర్మ సంగతి వేరే చెప్పక్కర్లేదు. కాపులను కమ్మోళ్లకు అమ్మేశాడంటూ రిప్ కాపులు.. కంగ్రాచ్యులేషన్స్ కమ్మోళ్లు అని వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఇక తాజాగా ఏపీలో ‘కేఏ పాల్ నెక్స్ట్ సీఎం తానేనని బల్లగుద్ది చెప్తున్నారు. చంద్రబాబు కూడా తాను ముఖ్యమంత్రి అవుతానని అంటున్నారు. ఇప్పటివరకు ఆ మాట అనని ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్. అంటే కమ్మదొరలకు తల వంచేసినట్టేనా? యాజ్ ఏపీ ఫ్యాన్ ఐ హర్టెడ్’అని ట్వీట్ చేయడంపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంతటితో ఆగని వర్మ మరోసారి ‘కాపులు – కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు – సేనలు ఇస్ నాట్ = ఓట్లు’ అంటూ సంచలన ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్ లపై టీడీపీ, జనసేన నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వర్మను ఎడాపెడా ఏకిపారేస్తున్నారు. నైతిక విలువలు లేని వాళ్లు కూడా మాట్లాడేవాళ్లే అని విరుచుకుపడుతున్నారు. అంతటితో ఆగక పవన్ కల్యాణ్ అభిమానులు రాంగోపాల్ వర్మకు దశదినకర్మ నిర్వహించారు. ఆయన ఫోటో పెట్టి వర్మ చనిపోయారు అని దండేసి పూలు చల్లుతున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కామంతో కాళ్లు నాకావు.. పేటీఎం డబ్బుల కోసం ఏమైనా నాకుతావు అని తీవ్ర పదజాలంతో టార్గెట్ చేస్తున్నారు.