సోనూసూద్‌కు భారతరత్న..ట్విటర్‌లో ట్రెండింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

సోనూసూద్‌కు భారతరత్న..ట్విటర్‌లో ట్రెండింగ్

May 29, 2020

 

sonu sood.

నటుడు సోనూ సూద్ వలస కూలీల పాలిట వరంలా మారారు. ఈ విపత్కర సమయాల్లో సోనూ సూద్ ఎందరో వలసకూలీలను సొంతూళ్లకు చేర్చుతున్నారు. ఈ క్రమంలో సోనూ సూద్ గురించి సోషల్ మీడియా మొత్తం పొగడ్తల్లో ముంచెత్తుతోంది. 

తాజాగా సోనూసూద్ వలస కూలీలను సొంత గ్రామాలకు చేర్చడం కోసం ఏకంగా ఓ విమానాన్ని ఏర్పాటు చేశాడు. కేరళలోని ఎర్నాకుళంలో ఓ కుట్టుమిషన్ల కంపెనీలో పనిచేస్తున్న 177 మంది మహిళలు తమ సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లాలంటూ సోనూసూద్‌ను సాయం కోరారు. ఆ విషయం తెలిసిన వెంటనే వారి కోసం ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాడు. సోను సూద్ చేస్తున్న నిస్వార్ధ సేవకు ఫిదా అయిన నెటిజన్లు అతడికి దేశ అత్యుత్తమ పురస్కారం ‘భారతరత్న’ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు #BharatRatnaforSonuSood ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.