Fans who surprised Sai Pallavi.. Here is the video
mictv telugu

అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన సాయి పల్లవి..వీడియో ఇదిగో

July 18, 2022

టాలీవుడ్ లేడి పవర్ స్టార్ సాయి పల్లవి..తన అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. ‘గార్గి’ సినిమా ప్రదర్శన జరుగుతున్న పలు థియేటర్లకు వెళ్లి, అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఎలాంటి బందోబస్తు లేకుండా థియేటర్లోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాంతో అభిమానులు సినిమాను వీక్షించటం పక్కనపెట్టి, సాయి పల్లవితో సెల్పీలు, ఫోటోలు దిగారు. అయితే, సాయి పల్లవి అభిమానులను సర్‌ప్రైజ్ చేయటం కంటే అభిమానులే ఆమెకు తమ అభిమానంతో వందరేట్లు ఆనందపడేలా చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

 

వివరాల్లోకి వెళ్తే..ఈ మధ్య టాలీవుడ్‌లో తమ చిత్రాలను ప్రమోట్ చేయడానికి చిత్రబృందాలు కొత్త కొత్త మార్గాలను వెతుక్కుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సినిమా ప్రదర్శన జరిగే థియేటర్లలోకి నటీనటులు సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి, అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా నటి సాయి పల్లవి సైతం ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ, సినీ ప్రియుల్ని సర్‌ప్రైజ్ చేయడానికి ఆమె పలు థియేటర్లకు వెళ్లారు. అయితే, ఈమె వాళ్లని సర్‌ప్రైజ్ చేయడం పక్కన పెడితే, తమ అభిమానంతో వాళ్లే ఆమెను ఆనందపడేలా చేశారు. ఆమెతో ఫోటోలు, సెల్పీలు దిగుతూ, జై సాయి పల్లవి, జై లేడి పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు.

ఇక, గార్గి సినిమా విషయానికొస్తే..జులై 15న ఈ సినిమా విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సొంతం చేసుకుంది. దీంతో సాయిపల్లవి.. చెన్నై, హైదరాబాద్‌లోని పలు థియేటర్లను సందర్శించింది. సినిమా పూర్తయ్యే సమయానికి థియేటర్లోకి వెళ్లి అక్కడి వారందరితో మాట్లాడింది. సాయిపల్లవిని చూసి ఆశ్చర్యానికి గురైన వాళ్లందరూ.. ‘గార్గ్’లో ఆమె నటనను ప్రశంసించారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబర్చారు. వాళ్లు చూపించే అభిమానానికి సాయిపల్లవి కాస్త ఎమోషనల్ అయ్యారు.