అమానవీయం..తెగిపడిన కాళ్లనే తలదిండులా ఉపయోగించారు
విరిగిపోయిన కాళ్ళను తలదిండులా వాడిన అమానవీయ సంఘటన హరియాణాలో చోటుచేసుకుంది. ఓ యువకుడిని రైలు ఢీకొట్టిన ప్రమాదంలో రెండు కాళ్ళు తెగిపడ్డాయి. దీంతో ఆ యువకుడు స్థానికుల సాయంతో తెగిన కాళ్లతో ఆసుపత్రికి వచ్చాడు.
ఐతే అతడికి చికిత్స చేయాల్సిన సిబ్బంది తలకింద అతని కాళ్లనే దిండులా పెట్టారు. వివరాల్లోకి వెళితే…రాష్ట్రంలోని ఫరీదాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రదీప్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే అతను తన ఆఫీస్‌కు వెళ్తూ రైలు పట్టాలు దాటుతున్నాడు. అదే సమయంలో వస్తున్న రైలును అతను గమనించక పోవడంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రదీప్ రెండు కాళ్లు తెగిపోయి దూరంగా పడ్డాయి. స్థానికులు ప్రదీప్‌ను, తెగినపడిన అతని కాళ్లతోపాటు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రదీప్ పట్ల మానవత్వం చూపాల్సిన వైద్య సిబ్బంది ఇలా వ్యవహరించారు. దీంతో వైద్య సిబ్బందిపై అంతా మండిపడుతున్నారు.