ప్రేమించలేదని కాల్చి చంపాడు.. హరియాణాలో దారుణం  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమించలేదని కాల్చి చంపాడు.. హరియాణాలో దారుణం 

October 27, 2020

nfgnf

నడిరోడ్డుపై ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించడం లేదని కక్షతో యువతిపై కాల్పులకు తెగబడ్డారు. సోమవారం మధ్యాహ్నం ఫరీదాబాద్‌లోని బల్లబ్‌ గర్ ఈ దారుణం చోటు చేసుకుంది. దీంతో నికితా తోమర్ (21) అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయింది.  పాయింట్ బ్లాంక్ లో తుపాకీ జరిపిన ఈ కాల్పులతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. దాడికి కారణమైన ఓ వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. 

అగర్వాల్ కళాశాలలో చదువుతున్న నికితా తోమర్ తన స్నేహితురాలితో కలిసి బయటకు వచ్చింది. అదే సమయంలో ఆమె రాక కోసం తౌఫీక్‌ కారులో వేచి చూస్తూ ఉన్నాడు. తన స్నేహితుడితో కలిసి వచ్చి నేరుగా తలకు గురిపెట్టి కాల్పులు జరిపాడు. కాగా, కొంత కాలంగా తైఫిక్ ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇటీవలే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలిపై కాల్పులు జరిగిన వెంటనే మరో నిందితులు కూడా కారులోంచి దిగి తౌఫీక్‌ను కారులోకి ఎక్కించుకొని పారిపోయాడు. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. నడిరోడ్డుపై జరిగి ఈ సంఘటనపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.