పులిగా మారిన కుక్క.. పెద్ద కథే ఉంది..  - MicTv.in - Telugu News
mictv telugu

పులిగా మారిన కుక్క.. పెద్ద కథే ఉంది.. 

November 29, 2019

Dog ..............

ఎవరైనా కుక్కను కుక్కలానే పెంచుతారు గానీ, పులిలా పెంచుతారా? లేదు కదా.. కానీ ఓ రైతు మాత్రం తన కుక్కను పులిలా పెంచుకుంటున్నాడు. అదేంటని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమే. ఆ కథేంటో చెప్పేముందు మీరు ఆ రైతు పాట్ల గురించి తెలుసుకోవాలి. కర్ణాటకలోని నాలూరు గ్రామం శ్రీకాంత గౌడ్ అనే రైతు పొలంలోని పంటను కోతులు సర్వనాశనం చేసేవి. దీంతో నాలుగేళ్ల కిందట ఓ పులి బొమ్మను తోటలో పెట్టాడు. అప్పటి నుంచి కోతులు అటువైపు రావడం మానేశాయి. ఇదేదో బాగుందనుకున్న శ్రీకాంత్ మరో తోటలో కూడా పులిబొమ్మను ఏర్పాటు చేశాడు. అది కూడా ఫలించింది. దీంతో అతనకి మరో ఉపాయం తట్టింది. 

ఫోటోల్లో పులి కదలకుండా ఉంటుంది. అదే పులి కదిలితే ఇంకెలా ఉంటుంది అనుకున్నాడు. వెంటనే తన కుక్కకు పులి మాదిరి నల్లటి చారల రంగులు వేశాడు. ఎవరైనా దానిని దూరం నుంచి చూస్తే పులే అనుకుంటారు. మరి ఇలా రంగులు వేస్తే కుక్క చర్మం దెబ్బతినదా అని డౌట్ రావొచ్చు. శ్రీకాంత్ ఆ విషయంలో చాలా జగ్రత్త తీసుకుంటున్నాడు.  ప్రస్తుతం దానికి హెయిర్ డై వేస్తున్నానని తెలిపాడు. అతని ఐడియా బాగానే పనిచేసిందని భావించిన ఇతర రైతులు కూడా కుక్కలకు పులి మాదిరి రంగులు వేస్తున్నారు. అయితే పులి చారలు పెట్టుకుని కుక్క ‘భౌభౌ’ అని అరిస్తే కోతులు పసిగట్టేస్తాయేమో అని కొందరు అంటున్నారు.