సర్వే అధికారులపై పెట్రోల్ చల్లి నిప్పంటించిన రైతు - MicTv.in - Telugu News
mictv telugu

సర్వే అధికారులపై పెట్రోల్ చల్లి నిప్పంటించిన రైతు

May 10, 2022

పొలాల నుండి రహదారి కోసం సర్వే చేస్తున్న అధికారులపై ఓ రైతు దారుణానికి తెగబడ్డాడు. వారిపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. జగిత్యాల జిల్లాల బీర్పూర్ మండలంలో ఈ దారుణం జరిగింది. మండలంలోని తుంగూర్ గ్రామ పొలాల్లో ఎంపీవో రామకృష్ణరాజు, సారంగాపుర్ ఎస్సై గౌతమ్ పవార్, పలువురు అధికారులు సర్వే నిర్వహిస్తుండగా.. గంగాధర్ అనే రైతు పొలంలో మందు స్ప్రే చేసే డబ్బాలో పెట్రోల్ నింపి వారిపై స్ప్రే చేసి నిప్పటించాడు.

ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణరాజు కు నిప్పంటుకుని గాయాలు కాగా ఎస్సై గౌతమ్ పవార్ ,ఎమ్మార్వో, డీఎల్ పీవో సహా పలువురు అధికారులు తృటిలో తప్పించుకున్నారు. గాయపడ్డ ఎంపీవో ను చికిత్స నిమిత్తం జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ బీ ఎస్ లత,ఆర్డీవో మాధురి గాయపడ్డ ఎంపీవో పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన గంగాధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.