మొసలిని గొర్రెలా తాళ్లతో కట్టేసిన వనపర్తి రైతు - MicTv.in - Telugu News
mictv telugu

మొసలిని గొర్రెలా తాళ్లతో కట్టేసిన వనపర్తి రైతు

November 9, 2019

మొసలి నీళ్లలో సైలెంట్‌గా ఉంటూ అదునుచూసుకొని మిగతా జీవిలపై అటాక్ చేస్తూ ఉంటుంది. అలాంటి మొసలిని చూస్తే ఎవరైనా భయంతో పారిపోతారు. కానీ, ఓ రైతు మొసలిని గుంజకు తాళ్లతో కట్టేసాడు. 

farmer tied crocodile.

ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం బూత్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలం దగ్గరికి వెళ్లిన రైతుకు ఊహించని సంఘటన ఎదురైంది. పొలంలో పనుల్లో ఉండగా ఓ మొసలి రైతుకు కనిపించింది. వెంటనే కొంతమంది రైతుల సాయంతో ఆ మొసలిని పట్టుకొని తాళ్లతో బంధించి కట్టి పడేశారు. దీనికి సంబందించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.