పసుపు బోర్డు కోసం రైతు కార్యచరణ కమిటీ పాదయాత్ర - MicTv.in - Telugu News
mictv telugu

పసుపు బోర్డు కోసం రైతు కార్యచరణ కమిటీ పాదయాత్ర

March 3, 2022

17

నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని జిల్లా రైతులు, రైతాంగ నాయకులు కదం తొక్కారు. బోర్డు ఏర్పాటుతోపాటు పసుపుకు రూ. 15 వేల మద్దతు ధర ప్రకటించాలని గురువారం పాదయాత్ర చేపట్టారు. మెట్‌పల్లి ముత్యంపేట నుంచి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ వరకు సాగిన పాదయాత్రలో రైతు ఐక్యకార్యాచరణ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, రైతు ఐక్యవేదిక నాయకులు తిరుపతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మామిడి నారాయణ రెడ్డి తదితులు పాల్గొన్నారు.

పసుపును రూ. 15వేల మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎర్రజొన్నను రూ. 4500తోపాటు వరినీ కొనుగోలు చేయాలని, నిజాం షుగర్ ఫ్యాక్టరీలను వెంటనే తేరిపించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాదయాత్రలో రైతు ఐక్య కార్యాచరణ నాయకులు యాద గౌడ్, లింగారెడ్డి, పిట్ల రామకృష్ణ, ఆకుల గంగన్న, పీడీఎస్‌యూ జిల్లా ఉపధ్యక్షుడు ఎం.నరేందర్, మల్లయ్య, కోల నారాయణ, నర్సారెడ్డి, బాబన్న, బాబయ్య కిషన్, సురేశ్, సత్యనారాయణ గౌడ్, హనీశ్ తదితరులు ఈ మహా పాదయాత్రలో పాల్గొన్నారు.