farmers Demand to cancel Kamareddy Municipality Plan
mictv telugu

కామారెడ్డి కలెక్ట్‌రేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్..

January 5, 2023

కామారెడ్డి కలెక్ట్‌రేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపాలిటీ మాస్టర్​ ప్లాన్​ రద్దు చేయాలని రైతుల కదం తొక్కారు. మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్‌లో భూమి పోతుందని దిగులుతో ఆత్మహత్య చేసుకున్న రైతు యొక్క కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగారు. ముందుగా వేలాది మంది బాధిత రైతులు ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ కు చేరుకున్నారు.అనంతరం వినతిపత్రం ఇచ్చేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వాటిని తోసుకుంటూ కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

కామారెడ్డి మున్సిపాలిటీలో మాస్టర్‌ప్లాన్ ముసాయిదా రద్దు కోరుతూ గత 20 రోజులుగా ఆందోళనను కొనసాగుతున్నాయి. పంటలు పండే పంట పొలాల నుంచి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించడంపై బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాన్‌లో భూమి పోతుందని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో ప్రజాప్రతినిధులు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉప సర్పంచ్ సహా ఏడుగురు వార్డు మెంబర్స్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైతులు ఆందోళనకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్, బిజెపి నాయకులు మద్దతు పలికారు.