Farmers dumping tomatoes on the roads for price crash distress
mictv telugu

వెయ్యి టన్నుల టమాటా.. గిట్టుబాటు ధర లేక..

August 11, 2022

ఈ ఏడాది టమాట ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు ముఖ్యంగా టమాటా సాగుతో అనంతపురం జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్‌లో ధరలు లేకపోవడం, నాణ్యత లేదంటూ వ్యాపారులు తిరస్కరించడంతో రైతులు ఎక్కువ శాతం పారబోశారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో టమాట 2 రూపాయలు పలుకుతున్నది. రాప్తాడు, శింగనమల, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో టమాట సాగు పెద్ద మొత్తంలో జరుగుతున్నది. పంట కోసే స్థితిలో లేకపోవడంతో చాలా మంది రైతులు తమ తోటల్లోకి పశువులను మేతకు అనుమతినిస్తున్నారు.

పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, రవాణా ఛార్జీలకు కూడా ఆ ధరలు సరిపోకపోవడంతో రైతులు తమ పంటను నేలపాలు చేస్తున్నారు జిల్లాలోని కక్కలపల్లి మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో ఎటూ చూసినా కుప్పలు కుప్పలుగా పడేసిన టమాటానే కనిపిస్తోంది. గత వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి టన్నులకుపైగా సరకును పారబోసినట్లు అంచనా.