రైతుల ఇష్టం.. ఎట్లాంటి షరతులు లేవు : నిరంజ‌న్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

రైతుల ఇష్టం.. ఎట్లాంటి షరతులు లేవు : నిరంజ‌న్ రెడ్డి

April 21, 2022

 

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వానాకాలంలో పండించే పంటల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో గురువారం ఆయన మాట్లాడుతూ..” ఈ వానాకాలంలో ఏ పంట వేసుకోవాల‌నేది పూర్తిగా రైతుల ఇష్ట‌ం. ఏ పంట వేసుకొన్న ఎలాంటి ఆంక్ష‌లు ఉండ‌వు. కొంద‌రు స్వార్థ‌ప‌రులు రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. మరికొందరు రైతులు మాత్రం ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌ను అర్థం చేసుకోని, ఇత‌ర పంట‌లను సాగు చేస్తున్నారు. రైతు పంట‌తో మార్కెట్‌కు వెళ్ల‌కుండా, క‌ల్లం వ‌ద్ద‌కే మార్కెట్ వెళ్లాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న. వ‌రి సాగుపై చేసే సూచ‌న‌లు ఆంక్ష‌లు కాదు. లాభ‌సాటి పంట‌లు వేయాల‌న్న‌దే మా ఉద్దేశ‌ం” అని మంత్రి అన్నారు.

అంతేకాకుండా బియ్యం కాకుండా వ‌డ్లు తీసుకోవాల‌ని కేంద్రాన్ని కోరుతున్నామ‌ని తెలిపారు. కొంద‌రు కుర‌చ‌బుద్దితో తెలంగాణ విజ‌యాల‌ను మ‌రుగునప‌డేయాల‌ని చూస్తున్నార‌ని, అలాంటి వారు ఇప్ప‌టికైనా బుద్ధి మార్చుకోవాల‌ని నిరంజ‌న్ రెడ్డి సూచించారు.