farmer’s steel box with rs.22000 was washed away in the flood, cattale man got it
mictv telugu

భూమిలో స్టీల్ డబ్బా.. అనుమానంతో తెరచి చూసిన రైతుకు షాక్

June 17, 2022

మీలో ఎవరికైనా హఠాత్తుగా అడవిలో డబ్బులు దొరికితే ఏం చేస్తారు.?.. గుజరాత్‌లోని శరభండ గ్రామానికి చెందిన ఓ రైతు మాత్రం మిగతావారిలా స్వార్ధంగా ఆలోచించలేదు. పెద్దగా చదువుకోకపోయినా.. ఆ పశువుల కాపరి సంస్కారంతో తనది కానీ సొమ్మును ఆ ఊరి గ్రామ పెద్దకు అందజేశాడు. ముకేశ్‌భాయ్ అనే రైతుకు కొన్ని పశువులు ఉన్నాయి. ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం కూడా పశువులను మేపడానికి బహిరంగ ప్రదేశానికి వెళ్లిన ఆయనకు.. పక్క ఊరి సరిహద్దు ప్రాంతంలో భూమిలో ఓ స్టీల్ డబ్బా కనిపించింది. భూమిలో సగంపైనే కూరుకుపోయ ఉన్న ఆ స్టీల్ బాక్సును భూమిలోంచి తీసి, ఓపెన్ చేశారు. అందులో సుమారు రూ.22వేలు ఉండటంతో షాకయ్యారు. వెంటనే సదరు గ్రామ సర్పంచ్ దగ్గరకు వెళ్లి విషయం వివరించారు. ఆ తర్వాత ఆ డబ్బు మున్నాభాయ్ అనే రైతువని తెలిసి.. మొత్తాన్ని ఆయనకు అప్పగించారు. ఈ క్రమంలో మున్నాభాయ్ సంతోషం వ్యక్తం చేశారు.

భూమిలో ఎందుకు కూరుకుపోయింది..?

మున్నాభాయ్ తన ఇంటి మరమ్మత్తుల కోసం కష్టపడి సంపాదించిన డబ్బును ఓ స్టీల్ బాక్స్‌లో దాచాడు. అయితే గత ఏడాది వచ్చిన వరదల వల్ల ఇంట్లోకి భారీగా వరద నీరు చేరి, ఆ నీటి ప్రవాహానికి స్టీల్ బాక్స్ కొట్టుకుపోయింది. దీంతో కొన్ని రోజులు బాధపడి ఆ విషయాన్ని మర్చిపోయాడు. సంవత్సరం తర్వాత ఆ బాక్స్ తిరిగి తన వద్దకు చేరడంతో భావోద్వేగానికి గురయ్యాడు మున్నాభాయ్. ఈ క్రమంలో.. ఆ డబ్బులోంచి కొంత డబ్బును దేవుని హుండీలో వేసి.. ఇంకొంత మొత్తాన్ని ముకేశ్‌భాయ్ ఇవ్వబోయాడు. అయితే ఆ డబ్బును ముకేశ్‌భాయ్ సున్నితంగా తిరస్కరించాడు. ఈ నేపథ్యంలో ముకేశ్‌భాయ్ చేసిన పని ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయింది. అందరూ ముకేశ్‌భాయ్ మంచితనాన్ని ప్రశంసిస్తున్నారు.